బాలా చిత్రానికి అరుదైన గౌరవం - Ayushmann Khurranas Bala to be showcased at IndoGerman Filmweek
close
Updated : 27/09/2020 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలా చిత్రానికి అరుదైన గౌరవం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన వినోదాత్మక చిత్రం ‘బాలా’కు అరుదైన గౌరవం దక్కనుంది. బెర్లిన్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఇండో జర్మన్ ఫిల్మ్‌వీక్‌లో ఆదివారం బాలా చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ప్రసిద్ధ చిత్ర, వాణిజ్య విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. బాలా చిత్రాన్ని ఇండో జర్మన్‌ ఫిల్మ్‌వీక్‌లో ఆదివారం ప్రదర్శించబోతున్నట్లు ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

ఆయుష్మాన్‌ ఖురానా, భూమి పెడ్నేకర్‌, యామీ గౌతమ్‌ నటించిన బాలా చిత్రం బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించింది. 2019లో విడుదలైన ఈ వినోదాత్మక చిత్రాన్ని అమర్‌ కౌషిక్‌ డైరెక్ట్‌ చేయగా, దినేష్‌ విజన్‌ నిర్మించారు. సినిమాలో బట్టతలతో బాధపడే ప్రేమికుడిగా ఆయుష్మాన్‌ నటన విమర్శకుల మన్ననలు పొందింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని