కరోనా నుంచి కోలుకున్న రోగికి అరుదైన శస్త్రచికిత్స - Brain dead man breathes new life into COVID 19 patient with severe lung infection
close
Published : 30/08/2020 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నుంచి కోలుకున్న రోగికి అరుదైన శస్త్రచికిత్స

ఊపిరితిత్తుల మార్పిడి చేసిన చెన్నై వైద్యులు

చెన్నై: కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి చెన్నై వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఊపిరితిత్తుల మార్పిడి చేసి ఆసియాలోనే మొట్టమొదటిసారి ఈ ఘనత సాధించిన ఆసుపత్రిగా ఎమ్‌జీఎం హాస్పిటల్‌ నిలిచింది. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.  చెన్నైలోని ఎమ్‌జీఎం ఆసుపత్రి గుండె, ఊపిరితిత్తుల మార్పిడి విభాగం ఛైర్మన్‌ డా. బాలకృష్ణ వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌కి చెందిన వ్యాపారవేత్త (48) జూన్‌ 8న కరోనా వ్యాధి బారినపడ్డాడు. వ్యాధి ఆయన ఊపిరితిత్తులను పూర్తిగా దెబ్బతీసింది. రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో జూన్‌ 20న అతడిని వెంటిలేటర్‌పై ఉంచారు. పరిస్థితులు విషమిస్తుండటంతో రోగిని జులైలో ఎమ్‌జీఎంకి తీసుకొచ్చారు. వైద్యులు అతడిని వెంటిలేటర్‌పై ఉంచి, ఈసీఎమ్‌ఓ ట్రీట్‌మెంట్‌ అందించారు.

సదరు వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నా అతడి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు, కొంతభాగం మాత్రమే పనిచేస్తున్నట్లు డా.బాలకృష్ణ వివరించారు. కాగా ఆగస్టు 27న అతడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ‘ప్రస్తుతం ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయి. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని ఎమ్‌జీఎం కో-డైరెక్టర్‌ డా.సురేష్‌రావు తెలిపారు.

గురువారం బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి ఈ ఊపిరితిత్తులు సేకరించినట్లు వైద్యులు తెలిపారు. చెన్నైలోని గ్లెనేగ్లెస్‌ ఆసుపత్రిలో అతడి అవయవాలు భద్రపరచగా చేతులు, గుండె, కాలేయం కూడా ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురుకి అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని