నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీలోకి: జగన్‌ - CM Jagan review on National Education Policy
close
Published : 29/09/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీలోకి: జగన్‌

అమరావతి: రాష్ట్రంలోని అన్ని కళాశాలలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. తప్పనిసరిగా నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ), నేషనల్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏసీ) గుర్తింపు పొందాలని అధికారులను ఆదేశించారు. జాతీయ విద్యావిధానంపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వ కళాశాలలు కూడా ఆ ప్రమాణాలు సాధించాలని.. కళాశాలల్లో ప్రమాణాలపై ఎన్‌వోపీలు ఖరారు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 

అన్ని కళాశాలల్లో తరచూ తనిఖీలు చేయాలని జగన్‌ ఆదేశించారు. ఈ తనిఖీలకు 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయాలని.. ముఖ్యంగా టీచర్‌ ట్రైనింగ్‌ కళాశాలలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కళాశాలల్లో ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వాలని.. అప్పటికీ మార్పు రాకపోతే ఆ కళాశాలలను మూసివేయాలని స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో అధునాతన అంశాలతో కోర్సులు రూపొందించాలని చెప్పారు. ఇక నుంచి ఏడాది లేక రెండేళ్ల పీజీ.. మూడు లేక నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు ఉండాలని సూచించారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి పీహెచ్‌డీలో నేరుగా ప్రవేశానికి అర్హత కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అటానమస్‌ కళాశాలల సంఖ్య పెరగాలని.. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని