ఆ 7 రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా కేసులు - COVID 19 situation stabilising with positivity rate daily cases active cases reducing
close
Published : 22/05/2021 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ 7 రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌

దిల్లీ: దేశంలోని 7 రాష్ట్రాల్లోనే నిత్యం 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఆరు రాష్ట్రాల్లో నిత్యం 5 నుంచి 10వేల కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, దిల్లీలలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 93కు పైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని రోజుల కిందట బ్లాక్‌ ఫంగస్‌ నివారణకు ఉపయోగించే ఆంఫోటెరిసిన్‌ పరిమితస్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే  ఇప్పుడు దీని లభ్యత, సరఫరా పెరిగింది. ఆంఫోటెరిసిన్‌ తయారీ కోసం మరో 5 సంస్థలకు అనుమతులు మంజూరు చేసేవిధంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఔషధ మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తోంది. ప్రస్తుత తయారీ సంస్థలు తమ ఉత్పత్తి, సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా పని చేస్తున్నాయి. వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఏకాభిప్రాయం వచ్చే నాటికి మేము కూడా అదే స్థాయిని చేరుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఈ అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్థాయిలో ఏకాభిప్రాయం రాలేదు. వ్యాక్సిన్‌  తీసుకున్నవారిని దేశంలోకి అనుమతించాలా? వద్దా అనే అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.  డబ్ల్యూహెచ్‌వో, ఆయా దేశాల మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుతం కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారిని అనుమతిస్తున్నాం’’ అని లవ్‌ అగర్వాల్‌ వివరించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని