చైనాలో కొవిడ్‌ నివారణ వ్యాక్సిన్‌ పంపిణీ - China to offer experimental Covid vaccine to residents for 60 dollors
close
Updated : 21/10/2020 19:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనాలో కొవిడ్‌ నివారణ వ్యాక్సిన్‌ పంపిణీ

దరఖాస్తులు కోరిన డ్రాగన్‌

బీజింగ్‌: అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే కొవిడ్‌-19 వ్యాక్సిన్లను వినియోగించాలనే నిబంధనను సడలించి.. సాధారణ వ్యక్తులకు కూడా అందించేందుకు చైనా యంత్రాగం అనుమతించింది. ఈ క్రమంలో ప్రయోగాత్మక కరోనా వైరస్‌ వ్యాక్సిన్లను ప్రజలకు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఈ టీకా రెండు డోసుల ధర 60 డాలర్లుగా నిర్ణయించారు. తొలుత ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌, షావోజింగ్‌ నగరంలో 18-59 ఏళ్ల మధ్య వయసు గల ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చైనా ప్రకటించింది. కాగా, వ్యాక్సిన్‌ తమకెందుకు వేయాలో వారు దరఖాస్తులో వివరించాల్సి ఉంటుంది. అయితే వ్యాక్సిన్‌ పేరు, ఎప్పుడు, ఎన్ని డోసులు అందించేదీ తదితర  వివరాలను మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం.

ఈ దేశంలో పరిమిత సమూహాలకు ప్రయోగాత్మక కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ జులైలో ప్రారంభమైంది. ఇక స్వచ్ఛందంగా కరోనా టీకాలు అందించిన తొలి చైనా ప్రాంతంగా ఝెజియాంగ్‌ నిలిచిన సంగతి తెలిసిందే. గత వారం ఈ నగరంలో జరిగిన పంపిణీలో ఎంతమందికి వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చారో తెలియరాలేదు. ఐతే పనితీరు నిర్ధారణ కాకుండానే వ్యాక్సిన్ల పంపిణీ చేపట్టడంపై వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని