#20YearsOfNTR ఇది గమనించారా..! - Common DP Of 20YearsOfNTR Goes Viral In Internet
close
Published : 16/11/2020 20:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#20YearsOfNTR ఇది గమనించారా..!

వైరల్‌గా మారిన కామన్‌ డీపీ

హైదరాబాద్‌: నటనలోని రాజసం.. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌.. గ్రేస్‌ఫుల్‌ డ్యాన్స్‌.. ఇలా చెప్పుకుంటూ ఎన్నో విధాలుగా తెలుగు ప్రేక్షకులు చేరువయ్యారు టాలీవుడ్‌ కథానాయకుడు నందమూరి తారకరామారావు (జూనియర్‌ ఎన్టీఆర్‌). కథానాయకుడిగా ఆయన పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో 20సంవత్సరాలవుతున్న నేపథ్యంలో యంగ్‌ టైగర్‌ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. 20YearsOfNTR, 20YearsOfNTREra అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.

‘నిన్ను చూడాలని’ చిత్రంతో కథానాయకుడిగా ఎన్టీఆర్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అదే ఏడాదిలో విడుదలైన ‘స్టూడెంట్ నెం.1’ ఆయనకు ఘన విజయాన్ని అందించింది. ఆ తర్వాత తారక్‌ ఎన్నో కుటుంబ కథా, కమర్షియల్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తారక్‌ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఓ కామన్‌ డీపీని విడుదల చేశారు. కాయిన్‌ ఆకారంలో ఉన్న ఈ ఫొటోలో.. ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌ పోషించిన అన్ని పాత్రలను పొందుపరిచారు. అంతేకాకుండా మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌ సినిమాల్లో కీలకంగా ఉన్న కొన్ని ఆయుధాలను, ఆసక్తికర గుర్తులను కామన్‌ డీపీలో వరుసగా చూడొచ్చు. జి.శ్రీనివాస్‌ అనే వ్యక్తి క్రియేట్‌ చేసిన ఈ పిక్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

తారక్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని