బధిరుడిగా నాగశౌర్య? - Gossip On NagaShourya Upcoming Movie
close
Updated : 17/12/2020 23:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బధిరుడిగా నాగశౌర్య?

హైదరాబాద్‌: కెరీర్‌ ఆరంభం నుంచి వైవిధ్యభరితమైన కథలతోనే మెప్పిస్తూ వస్తున్నారు హీరో నాగశౌర్య. ఇప్పుడాయన చేతిలో దాదాపు అరడజను వరకు చిత్రాలున్నాయి. వాటిలో అగ్రహీరో బాలకృష్ణతో చేయనున్న ఓ సినిమా కూడా ఉంది. దీన్ని కొత్త దర్శకుడు శ్రీమన్‌ వేముల తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య ఓ బధిరుడిగా కనిపించనున్నారని  సమాచారం. అంటే మూగ, చెవిటి లక్షణాలున్న పాత్రలో దర్శనమివ్వబోతున్నారన్న మాట. అలాగని ఆయన పాత్రేమీ ఎమోషనల్‌గా ఉండదని, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. దీంట్లో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యముంటుందని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాదే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం నాగశౌర్య ‘లక్ష్య’, ‘వరుడుకావాలి’ చిత్రాలు చేస్తున్నారు.

ఇవీ చదవండి

రెమ్యూనరేషన్‌ వద్దన్న ఎన్టీఆర్‌..!

2020ని ఊపేసిన సిధ్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని