అలాంటివారితో ఆన్‌లైన్‌ పరిచయాలొద్దు: ఎన్టీఆర్‌ - Hyderabad city police make a video on Cyber crimes
close
Published : 09/10/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటివారితో ఆన్‌లైన్‌ పరిచయాలొద్దు: ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయవద్దని ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఫేస్‌బుక్‌/ ట్విటర్‌ వంటి మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే సమాచారం విషయంలో  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న హైదరాబాద్‌ నగర పోలీసులు తాజాగా సైబర్‌ మోసాలకు సంబంధించి ప్రముఖ హీరో ఎన్టీఆర్‌తో వీడియోను రూపొందించారు.

ఓ యువతికి ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ద్వారా ఎదురైన చేదు అనుభవాన్ని ఇతివృత్తంగా తీసుకొని పోలీసులు ఓ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించారు. ఈ వీడియోలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని