రాజ్‌నాథ్‌కు సినిమా స్క్రిప్టు అందజేసిన కంగన - Kangana Ranaut and her team meet Defence Minister Rajnath to show script of Tejas
close
Published : 14/12/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజ్‌నాథ్‌కు సినిమా స్క్రిప్టు అందజేసిన కంగన

ముంబయి: ‘తలైవి’ సినిమా షూటింగ్‌ పూర్తయిందో లేదో.. బాలీవుడ్‌ అగ్రనటి కంగన రనౌత్‌ మరో సినిమా పనుల్లో మునిగిపోయింది. ఆమె తన తర్వాతి సినిమా ‘తేజస్‌’లో భారత వైమానిక దళ పైలట్‌గా కనిపించనుంది. తాజాగా తన చిత్రబృందంతో కలిసి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసింది. ఈ సందర్భంగా స్క్రిప్టును ఆయనకు అందజేసింది. ఈ విషయాన్ని కంగన ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ‘ఈరోజు గౌరవ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గారిని మా తేజస్‌ బృందం కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. సినిమా అనుమతి కోసం భారత వైమానిక దళ (ఐఏఎఫ్) మీడియా కో-ఆర్డినేషన్‌ సెంటర్‌తో సినిమా స్క్రిప్టును కూడా పంచుకున్నాం’ అని రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన ఫొటోలను కంగన ట్విటర్‌లో పోస్టు చేసింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో నటిస్తున్న కంగన తాజాగా తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ‘తలైవి’ పాత్రకు ముగింపు పలకడం బాధగా ఉందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యింది. ఆమె తర్వాతి సినిమాలు ‘తేజస్’, ‘ధాకాడ్‌’లో నటిస్తోంది. ‘తేజస్‌’లో పైలట్‌గా కనిపించనున్న ఆమె అభిమానులను మెప్పించేందుకు తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లో వర్క్‌షాపులకు కూడా హాజరయ్యారు. ఈ సినిమాకు సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన కంగన ఫస్ట్‌లుక్‌ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి..

ఊర్మిళ ఒక శృంగార తార..! : కంగనమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని