ఆ రెండూ మాకెంతో ఇష్టం: కృనాల్‌ పాండ్య - Krunal Pandya shared a pic with Hardik Pandya which shows their fav bike and car
close
Published : 23/07/2020 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రెండూ మాకెంతో ఇష్టం: కృనాల్‌ పాండ్య

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నో ఏళ్లుగా తమ వద్ద ఉన్న కారు, బైక్‌ అంటే ఎంతో ఇష్టమని టీమ్‌ఇండియా క్రికెటర్‌ కృనాల్‌ పాండ్య తెలిపాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటో పంచుకున్న కృనాల్‌.. తన సోదరుడు హార్దిక్‌ పాండ్యతో కలిసి వాటిపై కూర్చొని ఉన్నాడు. ఆ కారు, బైక్‌ తమ ఇద్దరికీ చాలా ఇష్టమని, వాటిపై బయటకు వెళ్లడం సరదాగా ఉంటుందని చెప్పాడు. ముంబయిలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఈ సోదరులిద్దరూ అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. మరోవైపు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఇటీవలే తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. తన ప్రేయసి నటాషా స్టాంకోవిచ్‌ గర్భవతిగా ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. 

ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడడంతో ఐపీల్‌ 13వ సీజన్‌పై ఆశలు చిగురించాయి. ఇప్పటికీ అధికారిక సమాచారం లేకపోయినా సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్యలో యూఏఈలో నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ ముంబయి సోదరులు త్వరలోనే సాధన మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే నాలుగు నెలలుగా ఇంటికి పరిమితమైన ఈ సోదరులు ఐపీఎల్‌లో ఆడాలంటే మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించాల్సిన అవసరం ఉంది. కాగా, వీరిద్దరూ 2017, 2019 ముంబయి ఇండియన్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని