‘ఆది పురుష్‌’పై న్యాయవాది పిటిషన్‌ - Lawyer files petition on Adipurush
close
Published : 17/12/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆది పురుష్‌’పై న్యాయవాది పిటిషన్‌

లక్‌నవూ: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే ‘‘రాముడితో రావణుడు యుద్ధం చేయడం సబబే. రావణుడిలో ఉన్న మానవత్వ కోణాన్ని ‘ఆదిపురుష్‌’లో చూపించబోతున్నాం’’ అని ఓ సందర్భంలో చేసి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం కావడంతో సైఫ్‌ ఆఖరికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే.. ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది సినిమాపై జౌన్‌పూర్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సైఫ్ చేసిన వ్యాఖ్యలు మత విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. సైఫ్‌ అలీఖాన్‌తో పాటు చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ పేరును కూడా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా.. ఈ సినిమాలో రాముడి పాత్రలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కనిపించనున్నారు. రావణుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషిస్తున్నారు. కథానాయిక కోసం బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ను చిత్రబృందం సంప్రదించిందని వార్తలు వచ్చాయి. అయితే.. దానిపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత రాలేదు. భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ‘తానాజీ’తో ఇటీవల భారీ విజయం అందుకున్న ఓం రౌత్‌ తీయబోతున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. పాన్‌ ఇండియాగా తెరకెక్కనున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఇదీ చదవండి..

చిరు ‘లూసిఫర్’కు సారథి ఖరారు

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని