రాజస్థాన్‌ ఫోన్‌ట్యాపింగ్‌: వివరణ కోరిన కేంద్ర హోంశాఖ  - MHA ordered Rajasthan CS to provide details on Phone Tapping Allegations
close
Published : 19/07/2020 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజస్థాన్‌ ఫోన్‌ట్యాపింగ్‌: వివరణ కోరిన కేంద్ర హోంశాఖ 

జైపుర్‌: రాజస్థాన్‌ రాజకీయం రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఆడియో టేపుల వ్యవహారంపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రంగంలోకి దిగగా.. చట్టవిరుద్ధంగా ఫోన్‌లను ట్యాప్‌ చేశారన్న ఆరోపణలపై హోంశాఖ స్పందించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని రాజస్థాన్‌ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కాంగ్రెస్‌ సర్కారును కూల్చివేయడానికి శాసనసభ్యులను ప్రలోభపెట్టే సంభాషణలుగా చెబుతున్న ఆడియో టేపులపై కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే హోంశాఖ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ సర్కారు.. రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతుల్లో రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిందని భాజపా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, టేపుల్లో ఉన్నట్లుగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నించినట్లు అంగీకరింస్తోందని కాంగ్రెస్‌ వాదిస్తోంది.

ఇదీ చదవండి..

ఆడియో టేపులపై ఏసీబీ కేసు


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని