‘పుష్ప’ విలన్‌.. స్టార్‌ నటుడు క్లారిటీ..! - Madhavan Clarifies The Rumors PUSHPA Movies
close
Published : 01/10/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పుష్ప’ విలన్‌.. స్టార్‌ నటుడు క్లారిటీ..!

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రం గురించి స్టార్‌ నటుడు మాధవన్‌ క్లారిటీ ఇచ్చారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో మాధవన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారంటూ గత కొన్నిరోజులుగా పలు వెబ్‌సైట్లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై మాధవన్‌ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ‘పుష్ప’ చిత్రంలో తాను నెగటివ్‌ రోల్‌లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో బన్నీ చిత్రంలో ప్రతినాయకుడిగా ఎవరు కనిపించనున్నారనే విషయంలో ప్రస్తుతానికి సంగ్ధిదత నెలకొని ఉంది.

‘అల.. వైకుంఠపురములో..’ విజయం తర్వాత అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన చిత్తూరు యాసను నేర్చుకుంటున్నారు. అలాగే లుక్‌లో కూడా ఎన్నో మార్పులు చేశారు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాల తర్వాత సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇందులో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు. మరోవైపు ప్రస్తుతం మాధవన్‌ ‘నిశ్శబ్దం’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని