close

తాజా వార్తలు

Updated : 23/05/2020 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహేశ్‌తో పోటీపడుతున్న గౌతమ్‌..!

వీడియో షేర్‌ చేసిన సూపర్‌స్టార్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ దొరకడంతో తన తనయుడు గౌతమ్‌, కుమార్తె సితారతో సరదాగా గడుపుతున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. ఫిట్‌నెస్‌ కోసం వర్కౌట్లు చేయడంతోపాటు తన పిల్లలతో కలిసి ఆటలు ఆడటం, ఈత కొట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా మహేశ్‌ తన తనయుడు గౌతమ్‌తో హైట్‌ చెక్‌ చేసుకున్నారు. గౌతమ్‌ ఎదురుగా నిల్చుని సరదాగా ఎత్తు కొలుచుకుంటున్న ఓ వీడియోను సూపర్‌స్టార్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఆరడుగుల మహేశ్‌ ఎత్తుకు గౌతమ్‌ ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారు. ‘హైట్‌ చెక్‌!! హి ఈజ్‌ టాల్, లాక్‌డౌన్‌లో కొంచెం ఫన్నీగా..’ అని మహేశ్‌ పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన ప్రిన్స్‌ అభిమానులు.. ‘సూపర్‌, ఈట్స్‌ కూల్‌, లాక్‌డౌన్‌ డైరీస్‌, హ్యాపీ ఫ్యామిలీ, సూపర్‌స్టార్‌ హైట్‌కి ఏమాత్రం తీసిపోలేదుగా..!’ అని అంటున్నారు.

అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరునీకెవ్వరు’ చిత్రంలో మహేశ్‌ నటించారు. మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన తదుపరి చిత్రాల గురించి మహేశ్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మహేశ్‌-రాజమౌళి చిత్రం ప్రారంభం కానుంది.

 Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన