
తాజా వార్తలు
ఇండియన్ ఐడల్ 12: రూ.5 వేలు అప్పు తీసుకున్నాం!
సాయం చేయడానికి ముందుకొచ్చిన నేహాకక్కడ్
నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
ముంబయి: దేశవ్యాప్తంగా ఉన్న గాయనీగాయకులను గుర్తించి.. వారిలోని టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే నంబర్ వన్ సింగింగ్ షో ‘ఇండియన్ ఐడల్’. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈ షో తాజాగా 12 సీజన్లోకి అడుగుపెట్టనుంది. నవంబర్ 28 నుంచి ప్రసారం కానున్న సరికొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే, వాటిల్లో జయపూర్ కంటిస్టెంట్ షాజద్ అలీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ప్రదర్శన అనంతరం ఈ ప్రోగ్రామ్‌కి రావడం గురించి షాజద్ మాట్లాడుతూ.. ‘నా కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మాకు సరైన ఇల్లు కూడా లేదు. ఈ ప్రోగ్రామ్ కోసం మా నానమ్మ రూ.5 వేలు అప్పు చేసి నన్ను ముంబయికు పంపించింది. అలా నేను ఈ స్టేజ్‌పైకి వచ్చాను. ఈ సీజన్లో విజేతగా నిలిచి వచ్చిన డబ్బుతో మా కుటుంబానికి ఓ మంచి ఇంటిని కట్టించాలనే లక్ష్యంతోనే ఇందులో పాల్గొంటున్నాను’ అని తెలిపారు.
షాజద్ మాటలతో భావోద్వేగానికి గురైన ప్రముఖ గాయని నేహాకక్కడ్.. తన వంతు సాయంగా సదరు కంటిస్టెంట్‌కు రూ.1 లక్ష ఇస్తానని ప్రకటించారు. షాజద్ పాటకు ఫిదా అయిన గాయకుడు విశాల్ స్పందిస్తూ.. ‘గాయకుడిగా నువ్వు మరింత పరిణతి చెందేందుకు అవసరమైన మంచి గురువును ఏర్పాటు చేస్తాను ’ అని హామీ ఇచ్చారు.