3కోట్ల మాస్కులు, 22,533 వెంటిలేటర్లు ఇచ్చాం! - Over 3 crore N95 masks 10 crore HCQ tablets given to states
close
Published : 13/08/2020 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3కోట్ల మాస్కులు, 22,533 వెంటిలేటర్లు ఇచ్చాం!

రాష్ట్రాలకు సాయంపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన

దిల్లీ: దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేయడంతో పాటు అవసరమైన వైద్య పరికరాలనూ సమకూరుస్తోంది. కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో మార్చి 11 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసిన వైద్య పరికరాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 3.04 కోట్ల ఎన్‌ 95 మాస్కులు, 1.28 కోట్లకు పైగా పీపీఈ కిట్లు, 10.83 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఉచితంగా ఇచ్చినట్టు తెలిపింది. అలాగే, భారత్‌లో తయారైన 22,533 వెంటిలేటర్లను సైతం పలు రాష్ట్రాలకు పంపినట్టు ప్రకటనలో పేర్కొంది. కరోనా చికిత్సకు అవసరమైన సదుపాయాలు పెంచేందుకు రాష్ట్రాలకు కేంద్రం తనవంతు సహకారం అందిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఆరోగ్యశాఖ, టెక్స్‌టైల్‌, ఫార్మాస్యూటికల్‌ మంత్రిత్వశాఖలతో పాటు డీఆర్‌డీవో వంటి దేశీయ సంస్థల కృషితో ఈ కష్టకాలంలో దేశీయంగానే పీపీఈ కిట్లు, ఎన్‌ 95మాస్కులు, వెంటిలేటర్లు తయారు చేసుకొని సులభంగా పంపిణీ చేయగలిగినట్టు తెలిపింది. తద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా బలోపేతమైందని పేర్కొంది.

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. నిన్న ఒక్కరోజే దాదాపు 67వేల కేసులు నమోదయ్యాయి. అలాగే, రికార్డు స్థాయిలో 56,383మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 23,96,637కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 16,95,982మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 47వేలమందికి పైగా మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 6,53,622 యాక్టివ్‌ కేసులు ఉన్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని