పెళ్లికొడుకు నితిన్‌కు పవన్‌ ఆశీర్వాదం - POWERSTAR Pawan kalyan greets Hero nithiin
close
Published : 25/07/2020 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లికొడుకు నితిన్‌కు పవన్‌ ఆశీర్వాదం

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు నితిన్, శాలిని నిశ్చితార్థ వేడుక తాజాగా నిరాడంబరంగా జరిగింది. కరోనా నిషేధాజ్ఞలతో ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నితిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి దిగిన ఫొటోను నితిన్‌ అభిమానులతో పంచుకున్నారు.

‘‘పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పవర్‌స్టార్‌, త్రివిక్రమ్‌గారు, చినబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని నితిన్‌ ట్వీట్‌ చేశారు.

ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు ప్రఖ్యాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నితిన్‌-శాలిని వివాహం జరగనుంది. దీనికి సంబంధించి నితిన్‌ కుటుంబం ఇప్పటికే అతిథులకు శుభలేఖలు అందించింది. వీరి పెళ్లి ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉండగా, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని