కూల్‌గా ఉంటేనే సాధ్యం..!  - Pfizers Ultra Cold COVID19 Vaccine Needs Minus 70 Degrees Celsius
close
Published : 11/11/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కూల్‌గా ఉంటేనే సాధ్యం..! 

 నిల్వకు అతిశీతల ఉష్ణోగ్రతలు అవసరం

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌పై తమ టీకా 90శాతం విజయం సాధించిందని ఫైజర్‌-బయో ఎన్‌ టెక్‌లు చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ఆశలు రేకెత్తించింది. కానీ, ఈ టీకా వచ్చేందుకు మరింత సమయం పట్టవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ నెలాఖరుకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రెగ్యూలేటరీల సంతకాలు పూర్తియితే.. దీని రవాణాను ప్రారంభించవచ్చు. ఇక్కడే అసలు సమస్య మొదలు కానుంది. ఈ టీకా రవాణా చేయాలంటే అతిశీతల కంటైనర్లు అవసరం. అమెరికాలోనే అత్యాధునిక ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాలు దొరకడం కష్టం. దీంతో గ్రామీణ ప్రాంతాలకు దీనిని అందుబాటులోకి తీసుకురావడం సవాళ్లతో కూడుకొన్న పని. 

సమస్య దేనికి..

టీకాలను చాలా రకాలుగా అభివృద్ధి చేస్తారు. వీటిల్లో ఫైజర్‌-బయో ఎన్‌ టెక్‌ సంస్థలు ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని ఎంచుకొన్నాయి. ఇది సాంకేతికంగా అత్యాధునికమైంది. టీకా తయారీకి సింథటిక్‌ ఎంఆర్‌ఎన్‌ఏను వినియోగిస్తారు. ఇది వైరస్ ఆర్‌ఎన్‌ఏను పోలి ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లాకా కరోనావైరస్‌ను చంపే రోగనిరోధక కణాలను అభివృద్ధి చేస్తుంది. ఈ టీకాను భద్రపర్చచడానికి -70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరం. అమెరికాలో అత్యాధునిక ఆసుపత్రిగా పేరున్న మిన్నెసోటాలోని రోఛెస్టర్‌లో ఉన్న ‘ది మేయో క్లీనిక్‌’లో కూడా ప్రస్తుతం ఇటువంటి సౌకర్యాలు లేవు. ఇక టీకాను తరలించడానికి అవసరమైన కంటైనర్లు ఉండాలి.  

డ్రైఐస్‌తో ప్రయత్నాలు..

దీనిపై ఫైజర్‌ ప్రతినిధి కిమ్‌ బెన్స్కర్‌ మాట్లాడుతూ.. ‘‘మా కంపెనీ అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. అమెరికా, జర్మనీ, బెల్జియంతోపాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని పంపిణీ కేంద్రాల వరకు టీకాను ఎలా చేరవేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో డ్రైఐస్‌ను వినియోగించి గడ్డకట్టిన టీకా వైయల్స్‌ను విమాన మార్గాలు, భూమార్గాల ద్వారా తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఉష్ణోగ్రత వద్ద ఉంచిన టీకాలను 10రోజల వాడవచ్చు. అతిశీతల ఉష్ణోగ్రత వద్ద ఈ టీకాను ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. అదే అత్యధికంగా -8 డిగ్రీల వద్ద (అంటే సాధారణ రిఫ్రిజిరేటర్‌లో) మాత్రం ఐదు రోజులకు మించి నిల్వ ఉండదు. ఆ తర్వాత దెబ్బతింటాయి’’ అని పేర్కొన్నారు. 
రెండు వారాల వరకు సాధారణ శీతల పరిస్థితుల్లో ఉంచేలా మార్చవచ్చేమో అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఫైజర్‌ సీఈవో ఉగుర్‌ షహిన్‌ రాయిటార్స్‌కు తెలిపారు. 

అమెరికాలోనే ఇలా ఉంటే..!

 గ్రామీణ ప్రాంతాల్లోకి ఫైజర్‌ టీకా చేరడంపై ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లోనే అల్ట్రా కోల్డ్‌స్టోరేజీ ఫెసిలిటీలు లేవు. ఆయా రాష్ట్రాలు యుఎస్‌ సీడీసీ దాఖలు చేసిన ఫైలింగ్‌లో ఈ విషయం తెలిసింది. ఈ స్థాయి రిఫ్రిజిరేటర్ల సరఫరా కూడా చాలా పరిమితంగా ఉంది. కాలిఫోర్నియా అధికారులు ఈ విషయాన్ని అంగీకరించారు. తమ రాష్ట్రం కొత్తది కొనుగోలు చేయడానికి గానీ, లేదా లీజుకు తీసుకోవడంగానీ చేస్తుందని పేర్కొన్నారు. 
ఇప్పటికే న్యూహాంప్‌ షైర్‌ అదనంగా అల్ట్రా కోల్డ్‌ స్టోరేజీ ఫ్రిజ్‌ను కొనుగోలు చేసింది. మిగిలిన రాష్ట్రాలు కూడా నిధుల  కేటాయింపు కోసం ట్రంప్‌ సర్కార్‌తో మంతనాలు చేస్తున్నాయి. 

మరి ఇతర టీకాల పరిస్థి ఏమిటీ..?

అమెరికాకు చెందిన మోడెర్న సంస్థ కూడా ఇదే రకమైన టెక్నాలజీతో టీకాను అభివృద్ధి చేస్తోంది. అది కూడా తుది దశ ప్రయోగాలు జరుపుకొంటోంది. కానీ, ఈ టీకాను ఇంత అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద ఉంచాల్సిన అవసరం లేదు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, నోవావ్యాక్స్‌ టీకాలను మైనస్‌ 2 నుంచి మైనస్‌ 8 డిగ్రీల వద్ద  నిల్వ చేస్తే చాలు. అంటే సాధారణ రిఫ్రిజిరేటర్లు సరిపోతాయన్నమాట.  

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని