కాలుతున్న శవాన్ని.. పోస్టుమార్టానికి తరలించారు! - Police Lifts Body with Burning Pyre
close
Published : 13/10/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాలుతున్న శవాన్ని.. పోస్టుమార్టానికి తరలించారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘడ్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన స్థానికులను విస్మయానికి గురిచేసింది. బంధువుల సమక్షంలో మృతదేహానికి జరుగుతున్న దహన సంస్కారాలను మధ్యలోనే ఆపిన పోలీసులు సగం కాలిన భౌతికకాయాన్ని పంచనామాకు తీసుకెళ్లారు. బంధువులే తన భర్తను హత్య చేశారన్న భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేఖాబాయి, ఆమె భర్త ప్రేమ్‌సింగ్‌ల మధ్య నెల రోజుల క్రితం గొడవ జరిగింది. ఆ తరువాత పుట్టింటికి వెళ్లిన రేఖాబాయి భర్త ఇంటికి రాకుండా అక్కడే ఉంటున్నారు. ఇటీవల ప్రేమ్‌సింగ్‌ అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఈ విషయాన్ని భార్యకు తెలపకుండా ప్రేమ్‌సింగ్‌ తరఫు బంధువులే అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆమె తన భర్త ప్రేమ్‌సింగ్‌ను బంధువులే హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ్‌సింగ్‌ అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని