ఉపాసన జన్మదినం.. చెర్రీ ఇన్‌స్టా పోస్ట్‌లో... - Ram Charan pens beautiful note on wifes birthday
close
Updated : 20/07/2020 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపాసన జన్మదినం.. చెర్రీ ఇన్‌స్టా పోస్ట్‌లో...

సతీమణి ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చెర్రీ

 ఇంటర్‌నెట్ డెస్క్‌‌: ‘‘దయా గుణంతో నువ్వు చేసే ఏ పనీ వృథా కాదు. అయితే ఎంత చిన్న పనైనా సరే. నువ్వు ఇలాగే కొనసాగిస్తే.. దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతూనే ఉంటుంది’’ అంటూ ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాసుకొచ్చాడు. ఆయన సతీమణి ఉపాసన జన్మదినం సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమె దయా గుణం గురించి ఇన్‌స్టా పోస్టులో ప్రస్తావించాడు. దీంతో పువ్వుల వెనుక నిల్చుని ఆమె దీర్ఘంగా ఆలోచిస్తున్న ఓ ఫొటోను జత చేశాడు. మరోవైపు ఉపాసన జన్మదినం సందర్భంగా నెటిజన్లు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కరోనా కట్టడిలో భాగంగా గతంలో లాక్‌డౌన్ విధించిన‌ సమయంలో ఈ జంట ఇంట్లో గడిపిన ముచ్చటైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన కోసం రామ్‌చరణ్ చేసిన ప్రత్యేకమైన వంటకానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ వాయిదా పడడంతో రామ్‌చరణ్‌ ఇంటివద్దనే ఉంటున్నారు. ఉపాసన తనదైన శైలిలో అనేక విషయాలపై ప్రజలకు తరుచూ అవగాహన కల్పిస్తూ ఉంటారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని