‘ఉప్పెన’ కోసం మహేశ్‌ - Ranguladdhukunna from Upeena will be released by super star Mahesh babu
close
Updated : 05/11/2020 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ కోసం మహేశ్‌

హైదరాబాద్‌: పంజా వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ‘రంగులద్దుకున్న...’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని ఈ నెల 11న ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.

‘ప్రేమ అనే మహాసముద్రంలో దూకేందుకు రెడీ అవ్వండి...’ అంటూ మైత్రీ సంస్థ బుధవారం ట్వీట్‌ చేసింది. దేవిశ్రీప్రసాద్‌  ఈ చిత్రానికి స్వరకర్త. ఇప్పటికే ఇందులోని ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్‌ ధక్‌ ధక్‌..’ పాటలు విడుదలయ్యాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  ఈ సినిమా, థియేటర్లు తెరుచుకోగానే ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని