విజయ్‌ దేవరకొండ ఇంట్లో రష్మిక..! - Rashmika Attends Madhavi Devarakonda Birthday party
close
Updated : 25/09/2020 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ దేవరకొండ ఇంట్లో రష్మిక..!

హైదరాబాద్‌: ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో నటించి క్యూట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు విజయ్‌ దేవరకొండ, రష్మిక. తాజాగా విజయ్‌ దేవరకొండ ఇంట్లో జరిగిన ఓ పార్టీకి రష్మిక హాజరయ్యారు. తన తల్లి మాధవి 50వ పుట్టినరోజు వేడుకను విజయ్‌ తన ఇంట్లో వేడుకగా నిర్వహించారు. అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమంలో నటి రష్మిక తళుక్కున మెరిశారు. అనంతరం దేవరకొండ ఫ్యామిలీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా నెట్టింట్లో దర్శనమిచ్చాయి. విజయ్‌ ఫ్యామిలీతో రష్మికను చూసిన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్నారు. అనన్యపాండే కథానాయిక. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. మరోవైపు రష్మిక.. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ తర్వాత అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రానున్న ‘పుష్ప’ సినిమాకి ఓకే చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈసినిమా షూటింగ్‌ తర్వలో ప్రారంభం కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని