రియా చక్రవర్తి అరెస్ట్‌ - Rhea Chakraborty Arrested In Drugs Probe Linked To Sushant Death Case
close
Updated : 08/09/2020 17:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియా చక్రవర్తి అరెస్ట్‌

ముంబయి: బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్న నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. సుశాంత్‌కు సన్నిహితురాలైన రియాను మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన అధికారులు ఈ రోజు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5గంటలకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని అరెస్టు చేయడంతో.. నిన్ననే ఆమెను సైతం అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేకుండానే విచారణ ముగించిన అధికారులు విచారణకు ఆమె సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని రియాకు సమన్లు జారీచేశారు. 

రియాను ఆదివారం 6గంటల పాటు విచారించిన అధికారులు.. సోమవారం 8గంటలకు పైగా విచారించారు. తాజాగా విచారణ పిలిచి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాను అదుపులోకి తీసుకొన్న అధికారులు.. వీరంతా నిషేదిత మాదకద్రవ్యాలు పొందినట్టు చార్ట్‌ రికార్డులు ఉన్నట్టు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు రియాతో పాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. తాను డ్రగ్స్‌ తీసుకొచ్చానే తప్ప.. వాడలేదని రియా ఇప్పటికే పలు వార్తా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. సుశాంత్‌ గంజాయి వాడేవాడని తెలిపింది. ఎన్‌సీబీ విచారణలోనూ ఇదే సమాచారం చెప్పినట్టు తెలుస్తోంది. 

రాత్రి 7.30గంటలకు కోర్టు ముందుకు రియా..

మరోవైపు, రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అధికారులు ముంబయిలోని సియాన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలతో పాటు కొవిడ్‌కు సంబంధించి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు. ఆమెను ఈ రోజు రాత్రి 7.30గంటలకే కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.

సుశాంత్‌ మరణంపై నమోదైన కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు 28 ఏళ్ల రియాను విచారించిన సందర్భంలో ఆమె వాట్సాప్‌ చాట్‌ను పరిశీలించారు. అందులో డ్రగ్స్‌కు సంబంధించిన సంభాషణ ఉండటంతో ఈ కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ ఈ కేసులో రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించింది. నేనేం చేసినా సుశాంత్‌ కోసమే చేశానని ఆమె సోమవారం ఎన్‌సీబీ అధికారుల వద్ద అన్నట్టు సమాచారం. సోమవారం నుంచి తన సోదరుడు షోవిక్‌తో పాటు రియా విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

అసలు ఎవరీ రియా చక్రవర్తి?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని