‘రాధేశ్యామ్‌’ క్లైమాక్స్‌ కోసం భారీ సెట్‌..! - Special set erected for the Prabhas starrer costs this much
close
Updated : 12/11/2020 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’ క్లైమాక్స్‌ కోసం భారీ సెట్‌..!

ఖర్చు ఎంతంటే

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఇటలీలో షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని చిత్రబృందం కొన్నిరోజుల క్రితం భారత్‌కు చేరుకుంది. ఇటలీ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

కాగా, ‘రాధేశ్యామ్‌’ సినిమా సంబంధించిన క్లైమాక్స్‌ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన అతి కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారట. ఈ సెట్‌ కోసం నిర్మాతలు దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ నిక్‌ పోవెల్‌ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోనే యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారని సమాచారం.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, ప్రసిద్ధ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే ఆడిపాడనున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, తదితరులు ‘రాధేశ్యామ్‌’ సినిమాలో నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని