మినహాయింపుల్లేవమ్మా.. ఏదైనా 7.30 వరకే - T20 cricket social look
close
Published : 27/10/2020 22:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మినహాయింపుల్లేవమ్మా.. ఏదైనా 7.30 వరకే

నేటి ఐపీఎల్‌ విశేషాలు ఇవే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్‌ లీగ్‌ కీలక దశకు చేరుకుంది. ఇంతవరకూ ఏ ఒక్క జట్టు ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారు చేసుకోలేదు. చెన్నై మాత్రం ఇప్పటికే ఇంటిదారి పట్టింది. కాగా.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం కోసం హోరాహోరీ పోరు తప్పేలాలేదు. ఇదిలా ఉండగా.. ఆయా జట్ల యాజమాన్యాలు తమ ఆటగాళ్ల గురించి ఏమంటున్నాయో ఓసారి చూద్దాం..

ఏదైనా 7.30వరకే..
దిల్లీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, హైదరాబాద్‌ స్పిన్‌ అస్త్రం రషీద్‌ఖాన్‌ చిత్రాలతో దిల్లీ జట్టు ఓ పోస్టు చేసింది. సన్నిహితులు.. సోదరులు.. అవన్నీ గడియారం 7.30ను దాటే వరకే అని పేర్కొంది.

‘కెప్టెన్‌’ వేడుకలు..
హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌  పుట్టినరోజు సందర్భంగా జట్టు సభ్యులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను హైదరాబాద్‌ జట్టు యాజమాన్యం తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. 

మనవడు మైలురాయి దాటాడు..
డాడీస్‌ ఆర్మీగా పేరున్న చెన్నై జట్టు ఒక సరదా పోస్టు చేసింది. ఆ జట్టు యువ  ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ టీ20 క్రికెట్‌ లీగ్‌లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ‘మా మనవడు ఓ మైలు రాయి దాటాడు’ అని రాసుకొచ్చింది.
పంజాబ్‌కు ఇంకా కావాలి..
కేఎల్‌ రాహుల్‌  సారథ్యంలోని పంజాబ్‌ వరుసగా ఐదో విజయం సాధించింది. అనూహ్యంగా ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. ‘వరుస మ్యాచుల్లో విజయాలు సాధించడం గొప్పే.. కానీ.. జట్టుకు కావాల్సింది ఇంకా చాలా ఉంది’ అని ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ వసీం జాఫర్‌ అన్నాడు.
మినహాయింపుల్లేవమ్మ..
కొత్త రోజు.. కొత్త అడుగు.. మినహాయింపుల్లేవు.. అంటూ ముంబయి జట్టు ఓ పోస్టు పెట్టింది. అందులో సూర్యకుమార్‌ యాదవ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను జత చేసింది. 

క్వారంటైన్‌ అయిపోయింది.. సందడి మొదలైంది..

క్వారంటైన్‌ సమయం ముగియగానే మీరు కూడా ఇలాగే చేస్తారు అంటూ.. టీ20 క్రికెట్‌ లీగ్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు చేసింది. అందులో.. భారత జట్టు క్రికెటర్‌ జెమీ రొడ్రిగ్యూస్‌ చిందులు వేస్తూ కనిపించింది.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని