ఆ భూమి రూ.25లక్షలకెలా కేటాయిస్తారు? - TS High Court Comments on TS Govt
close
Updated : 27/08/2020 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ భూమి రూ.25లక్షలకెలా కేటాయిస్తారు?

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
దర్శకుడు శంకర్‌కు భూమి కేటాయింపుపై విచారణ

హైదరాబాద్‌: సినీ దర్శకుడు శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.2.5కోట్ల విలువ చేసే భూమిని రూ.25లక్షలకు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్‌ కీలకపాత్ర పోషించారని అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి అలాగే ఇస్తారా?.. ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని ప్రశ్నించింది. 

ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని.. మంత్రివర్గ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌ సిటీ ఉండగా మరో ఫిల్మ్‌సిటీ అవసరమా? అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్‌ దాఖలకు ప్రభుత్వం గడువు కోరగా.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని