Shruti Hassan: శ్రుతినే ఖాయమా? - Telugu news Is This Shruti Hassan Will Play Lead in Balayya Next Movie
close
Published : 28/10/2021 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shruti Hassan: శ్రుతినే ఖాయమా?

బాలకృష్ణకి జోడీగా శ్రుతిహాసన్‌ నటించనుందా? ఈ ప్రశ్నకి సమాధానం అవుననే వినిపిస్తోంది. గోపీచంద్‌ మలినేని  దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా కోసం స్క్రిప్టు  సిద్ధమవుతోంది. కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టింది చిత్రబృందం. త్రిష మొదలుకొని శ్రుతిహాసన్‌ వరకు పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇందులో శ్రుతిహాసన్‌ నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘బలుపు’, ‘క్రాక్‌’ల్లో శ్రుతినే కథానాయిక. తదుపరి సినిమా కోసమూ శ్రుతినే సంప్రదించారట. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’లో నటిస్తున్న శ్రుతి.... బాలకృష్ణ సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని