ఆటగాడికి పాజిటివ్‌: మ్యాచ్ వాయిదా - The first SAvENG ODI has been postponed
close
Published : 05/12/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆటగాడికి పాజిటివ్‌: మ్యాచ్ వాయిదా

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా×ఇంగ్లాండ్‌ తొలి వన్డే వాయిదా పడింది. దక్షిణాఫ్రికా ఆటగాడికి కరోనా సోకడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అయితే ఆటగాడి వివరాలు వెల్లడించలేదు. కాగా, నేడు జరగాల్సిన మ్యాచ్‌ను ఆదివారానికి వాయిదా వేశారు. నిబంధనల్లో భాగంగా మ్యాచ్‌కు ముందు కరోనా పరీక్షలు చేయగా సఫారీల జట్టులో ఓ ఆటగాడికి వైరస్ సోకినట్లు తేలిందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్ఏ) తెలిపింది. అయితే ఆ ఆటగాడు జట్టులో ఇతర ప్లేయర్లతో సన్నిహితంగా లేడని బోర్డు సీఈవో కుగాండ్రి తెలిపాడు. నేడు ఇరు జట్ల ఆటగాళ్లకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, ఆ ఫలితాలు రేపు వస్తాయని అన్నాడు.

‘‘దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నాం. నిబంధనల్లో భాగంగా మ్యాచ్‌కు ముందు కరోనా పరీక్షలు చేయగా దక్షిణాఫ్రికా ప్లేయర్‌కు పాజిటివ్ వచ్చింది. ఆటగాళ్లు, మ్యాచ్‌ అధికారుల భద్రత దృష్ట్యా మ్యాచ్‌ను నిలిపివేస్తున్నాం. నేటి మ్యాచ్‌ను ఆదివారం నిర్వహిస్తాం. దీన్ని ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు అంగీకరించాయి’’ అని ఓ ప్రకటనలో సీఎస్‌ఏ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఇరు జట్లు బయోబబుల్‌లోనే ఉన్నాయి. నవంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు ఇంగ్లాండ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని