హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో ఆఫర్‌ - Upto 50Percent cash back for Hyderabad metro passenders
close
Published : 01/11/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో ఆఫర్‌

హైదరాబాద్: రేపటి నుంచి హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది. మెట్రో స్మార్ట్ రీఛార్జ్‌పై 50 శాతం వరకు (రూ.600 వరకు) క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ అమల్లోకి తీసుకురానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లు, ఆన్‌లైన్‌లో రీఛార్జ్‌ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించనుందని స్పష్టం చేశారు. ప్రయాణికులకు వచ్చే క్యాష్ బ్యాక్ కూడా స్మార్ట్ కార్డులోనే జమ కానుందని వివరించారు. అయితే రీఛార్జ్‌ చేసుకున్న మొత్తాన్ని 90 రోజుల్లోగా వినియోగించుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. నగరంలోని మూడు కారిడార్లలో కలిపి నిత్యం 1.30 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఇటీవల సువర్ణ ప్యాకేజీలో భాగంగా 40 శాతం రాయితీ ప్రకటించిన అనంతరం ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగిందని వివరించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని