close
Published : 29/12/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయ్‌ ‘మాస్టర్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌...

చెన్నై: లోకేశ్‌‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘మాస్టర్’. మాళవిక మోహన్ కథానాయిక. విజయ్‌ సేతుపతి విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఆండ్రియా, శాంతను, అర్జున్‌ దాస్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను జతచేశారు.

ఈ చిత్రంలో విజయ్ కళాశాల విద్యార్థి, ఆచార్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కొవిడ్ కారణంగా ఆగిపోయిన సినిమాలన్ని శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకొని థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే విజయ్‌.. ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలని విన్నవించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి..

కళామతల్లికి కన్నీరు మిగిల్చారు..!


1343814055434145794

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని