ట్రోల్స్‌ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లా.. : వితిక - Vithika Sheru suffered from depression after A Reality Show
close
Published : 21/09/2020 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రోల్స్‌ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లా.. : వితిక

నా స్నేహితులు కూడా నన్ను సపోర్ట్‌ చేయలేదు

హైదరాబాద్‌: ఒకానొక సమయంలో తన గురించి వచ్చిన ట్రోలింగ్స్‌ చూసి మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని నటి వితిక అన్నారు. ఇటీవల యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన వితిక.. పలు ప్రత్యేక వీడియోలతో తరచూ అభిమానులను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె.. తన జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని నెటిజన్లకు తెలియజేస్తూ సరికొత్త వీడియోను విడుదల చేశారు. గతేడాది తన భర్త వరుణ్‌ సందేశ్‌తో కలిసి వితిక ఓ ప్రముఖ రియాల్టీ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే సదరు రియాల్టీ షో చూసిన ప్రేక్షకులు ఆమెను నెగటివ్‌గా అర్థం చేసుకుని విపరీతంగా ట్రోల్స్‌ చేశారట. దీంతో తన కుటుంబం కొంతకాలం ఇబ్బందిపడిందని వితిక తెలిపారు.

‘గతేడాది నాభర్త వరుణ్‌ సందేశ్‌తో కలిసి నేను ఓ రియాల్టీ షోలో పాల్గొన్నాను. ఆ షో నుంచి బయటకు వచ్చేవరకూ నేను ఎంతో ధైర్యవంతురాల్ని అనుకునేదాన్ని. ఆత్మస్థైర్యం కూడా ఎక్కువగా ఉండేది. నా గురించి ప్రేక్షకులు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏవిధంగా నెగటివ్‌ ట్రోలింగ్స్‌ చేస్తున్నారో, వాటిని చూసి నా కుటుంబం ఎంత ఇబ్బందిపడిందో ఆ షో నుంచి బయటకువచ్చాకే తెలిసింది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లా. నాకు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో షేర్‌ చేయడానికి కూడా భయపడ్డాను. ఆ ఫొటోలు చూసి ఏవిధంగా స్పందిస్తారో అనిపించేది. నిజం చెప్పాలంటే.. సదరు షోలోకి వెళ్లేంత వరకూ నాతో చక్కగా మాట్లాడిన నా స్నేహితులందరూ.. షో చూసి నన్ను సపోర్ట్‌ చేయలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బాధపడుతోన్న సమయంలో నాకుటుంబం నాకు అండగా ఉంది. ప్రతిసారీ నా వెన్నంటే ఉంటూ నన్ను మామూలు ప్రపంచంలోకి తీసుకువచ్చింది. ఎప్పటికైనా మనకి తోడుగా ఉండేది మన కుటుంబమే అనే విషయం అలాంటి సమయంలో తెలిసింది. ఎయిడ్స్‌, క్యాన్సర్ కంటే డిప్రెషన్‌ అనేది పెద్ద జబ్బు. నేను ఎదుర్కొన్న పరిస్థితి మరొకరికి రాకూడదనే ఈ వీడియో చేస్తున్నా. అలాగే నెటిజన్లు కూడా.. వేరొకరి గురించి నెగటివ్‌ కామెంట్లు చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి.’ అని వితిక కోరారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని