‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడితో శర్వానంద్‌ - We are Happy to announce our next project with our Versatile actor Sharwanand Mahasamudram
close
Published : 08/09/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడితో శర్వానంద్‌

హైదరాబాద్‌: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు శర్వానంద్‌. ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘శ్రీకారం’లో నటిస్తున్నారు. కాగా, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు ఆయన ఓకే చెప్పారు.

‘ఆర్‌ఎక్స్‌ 100’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్‌భూపతి. ‘మహా సముద్రం’ పేరుతో ఆయన ఓ కథను సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కథానాయకులుగా పలు పేర్లు వినిపించాయి. చివరకు శర్వానంద్‌ ఈ చిత్రంలో నటించనున్నట్లు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

‘గమ్యం’, ‘ప్రస్థానం’ తర్వాత శర్వా పోషించే బలమైన పాత్ర ఇదేనని తెలిపింది. అజయ్‌ రాసిన కథ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి వారం ఒక్కో అప్‌డేట్‌ ఇస్తామని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని