ఆ యువతి 800 కి.మీ ప్రయాణం.. ఎందుకంటే? - Woman travels from Uttar Pradesh to file rape case in Nagpur
close
Published : 06/10/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ యువతి 800 కి.మీ ప్రయాణం.. ఎందుకంటే?

నాగ్‌పూర్: ఉద్యోగం నిమిత్తం స్నేహితురాలితో కలిసుంటే ఆమె మోసిగింది..  దాన్ని ఆసరా చేసుకొని ఓ నిందితుడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఈ రెండు ఘటనలు బాధితురాలైన ఆ యువతిని ఏకంగా 800 కిలోమీటర్లు ప్రయాణించేలా చేశాయి. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి నుంచి తప్పించుకొని తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడానికి ఆ యువతి ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.  పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఉద్యోగం నిమిత్తం నేపాల్‌కు చెందిన 22 ఏళ్ల యువతి రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి తన స్నేహితురాలు అద్దెకు తీసుకున్న ఇంట్లో ఆమెతో కలిసి ఉంది. ఈ క్రమంలో సదరు స్నేహితురాలు దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోన్న తన స్నేహితుడు ప్రవీణ్ రాజ్‌పాల్ యాదవ్‌ను వీడియో కాల్‌ ద్వారా పరిచయం చేసింది. అయితే అప్పటికే నేపాలీ యువతి తన వద్ద ఉన్న సొమ్మును స్నేహితురాలికి ఇచ్చి దాచమనడం, తిరిగి ఆమెకు ఇవ్వకపోవడం వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ యువతి బాధితురాలిని తీవ్రంగా హింసించింది. ఇదే విషయాన్ని కొత్తగా పరిచయమైన దుబాయ్‌ స్నేహితుడికి చెప్పగా.. అక్కడి నుంచి వచ్చేయమని, దగ్గర్లోని హోటల్‌లో గది బుక్‌ చేశానని, అక్కడే ఉండమని చెప్పాడు.

అతడిది కూడా లఖ్‌నవూనే. రెండు రోజుల తరవాత అతడు భారత్‌కు వచ్చి,  హోటల్‌ గదిలో ఆమెను కలవడంతో పాటు ఆమెకు డ్రగ్స్‌ ఇచ్చి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమెను అభ్యంతరకర రీతిలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత కూడా మరోసారి అత్యాచారానికి పాల్పడటంతో పాటు, ఆమె సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలను అప్‌లోడ్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, తన మాట వినకపోయినా వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడు. అయితే, సదరు బాధితురాలు ఎలాగోలా తప్పించుకొని 800 కిలోమీటర్లు ప్రయాణించి, సెప్టెంబర్‌ 30న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న నేపాలీ స్నేహితురాలి వద్దకు చేరుకుంది. అక్కడికి దగ్గర్లోని కొరాడి పోలీసు స్టేషన్‌లో లఖ్‌నవూ స్నేహితురాలు, యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. అది వేరే రాష్ట్రం కేసు కావడంతో అక్కడి పోలీసులు దాన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌గా పరిగణించి.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా బాధితురాలితో పాటు పోలీసు బృందం లఖ్‌నవూకు చేరుకొని అక్కడి చిన్హాట్ పోలీసు స్టేషన్‌లో కేసు రిజిస్టర్‌ చేశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని