RRR: ఇది కదా రికార్డు అంటే - a gossip on rrr satellite rights
close
Updated : 22/05/2021 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ఇది కదా రికార్డు అంటే

హైదరాబాద్‌: దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని ప్రకటించిన రోజు నుంచే ఆ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మరోవైపు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తుండటంతో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు నెలకొన్న విషయం విదితమే. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రబృందం ఎంతో శ్రమిస్తోంది.

కాగా, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. విడుదల కంటే ముందే రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. అన్ని భారతీయ భాషలకు సంబంధించి ఈ సినిమా పోస్ట్‌ రిలీజ్‌ డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులను జీ గ్రూప్‌ వారు భారీ మొత్తం చెల్లించి సంపాదించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రూ.325 కోట్లను జీ గ్రూప్‌ ఈ టీమ్‌కి చెల్లించినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదొక రికార్డు అవుతుందని అందరూ అనుకుంటున్నారు.

యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన ఆలియాభట్‌.. ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించనున్నారు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని