రండి.. సాయం చేద్దాం - actors urge to donate
close
Published : 29/04/2021 17:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రండి.. సాయం చేద్దాం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. దీని వల్ల లక్షలాది మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సాయం చేద్దాం అని కోరారు యువ నటులు రానా, నాగ చైతన్య. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ల మనుగడకి మనవంతు కృషి చేద్దాం. అందరూ కలిసి సాయం చేయాలని కోరుతున్నాను. అత్యవసరాలైన ఆక్సిజన్‌, ఆహారం, మందులు అందించేందుకు ముందుకొస్తారని భావిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు రానా. ‘ఈ క్లిష్ట సమయంలో చిన్న సాయం అయినా ఎంతో ఉపయోగపడుతుంది. దయచేసి మీకు తోచిన సాయం చేయండి. మాస్క్‌ ధరించండి.. జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు నాగ చైతన్య.  ఫ్రమ్‌యుటుదెమ్‌ (https://www.ketto.org/fundraiser/fromu2them) వెబ్‌సెట్‌ వేదికగా సాయం చేయొచ్చన్నారు.

 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని