అయోధ్యకు వెళ్లనున్న అక్షయ్‌కుమార్‌! - akshay kumar to begin ram setu shoot from ayodhya on march 18
close
Updated : 16/03/2021 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయోధ్యకు వెళ్లనున్న అక్షయ్‌కుమార్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘గుడ్‌న్యూజ్‌’, ‘మిషన్‌ మంగళ్‌’ వంటి విభిన్నమైన చిత్రాల్లో అలరించిన నటుడు బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌. ప్రస్తుతం ఆయన ‘రామ్‌ సేతు’ అనే చిత్రంలో నటించనున్నారు. అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న  ఈ సినిమా షూటింగ్‌ని మార్చి 18న అయోధ్యలో ప్రారంభించనున్నారు. చిత్రానికి చంద్రప్రకాష్‌ ద్వివేది నిర్మాత. ప్రస్తుతం అక్షయ్‌ మాల్దీవుల్లో తన కుటుంబంతో కలిసి విహారయాత్ర చేస్తున్నారు.

సినిమా గురించి దర్శకుడు అభిషేక్‌ స్పందిస్తూ..‘‘అక్షయ్‌ కుమార్‌ ఈ చిత్రంలో పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. సినిమా షూటింగ్‌ 80శాతానికి పైగా ముంబయిలోనే చిత్రీకరించనున్నాం. అక్షయ్‌ నటించే పాత్ర ఇండియాతో పాటు ప్రపంచంలోని పురావస్తు శాస్త్రవేత్తలే ప్రేరణగానే తీసుకున్నాం. ఇందులో అక్షయ్‌ లుక్‌తో పాటు ఆయన పోషించే పాత్ర కూడా  అభిమానులకు కొత్తగా కనిపించనుంది. చిత్రంలో జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, నుష్రాత్‌ భరుచ్ఛా ప్రధాన కథానాయికలుగా నటిస్తున్నారు. ఇది భారతీయ పురాణం వెనుక ఉన్న సత్యాన్ని అన్వేషించడానికి ఒక మంచి అవకాశం. మన భారతీయుల వారసత్వంలోని ఒక భాగాన్ని అనుసంధానించే నిజమైన కథను ముందుకు తెచ్చే సదవకాశంగా భావిస్తున్నా’’ వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని