Allu Arjun: నువ్వే నా సపోర్ట్‌ - allu sirish turns 34 allu arjun and fans wish abcd actor on birthday
close
Published : 30/05/2021 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: నువ్వే నా సపోర్ట్‌

హైదరాబాద్‌: ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ సోదరుడు, నటుడు అల్లు శిరీష్‌ ఆదివారం 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, పలువురు యువ హీరోలు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. మరోవైపు తన తమ్ముడికి విషెస్‌ తెలుపుతూ బన్నీ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ప్రతి విషయంలో నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేసే నా ప్రియమైన తమ్ముడు శిరీష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలాగే మరెన్నో సెలబ్రేషన్స్‌ చేసుకోవాలని, ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని బన్నీ ట్వీట్‌ చేశారు.

కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది యువ హీరోలకు శిరీష్‌ బహుమతులు ఇచ్చారు. చాక్లెట్‌ కేక్‌, చాక్లెట్స్‌‌, బిస్కెట్స్‌ ఉన్న ఓ స్పెషల్‌ బాక్స్‌ని అడవి శేష్‌, విశ్వక్‌సేన్‌, రాశీఖన్నా, అల్లు అర్జున్‌లకు శిరీష్‌ పంపించారు. ‘హ్యాపీ బర్త్‌డే శిరీష్‌. చాక్లెట్‌ బాక్స్‌కి థ్యాంక్యూ. బర్త్‌డే నీది కానీ గిఫ్ట్స్‌ మాత్రం మా అందిరికీ’ అని శేష్‌ పోస్ట్‌ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని