9,024 కొత్త కరోనా కేసులు @ ఏపీ - ap corona update
close
Updated : 11/08/2020 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

9,024 కొత్త కరోనా కేసులు @ ఏపీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో (9am-9am)కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 58,315 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,44,549కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,597 యాక్టివ్‌ కేసులు ఉండగా..  1,54,749మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులో 9,113 మంది కోలుకున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25,92,619 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,372, కర్నూలు జిల్లా నుంచి 1,138 కేసులు వచ్చాయి. 

తాజాగా కరోనాతో 87 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లాలో పదమూడు మంది; చిత్తూరు జిల్లాలో పన్నెండు మంది; గుంటూరులో తొమ్మిది; ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఏడుగురు; కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు; తూర్పు గోదావరి, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; కృష్ణ, కర్నూల్‌ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతులు 2,203కి చేరారు.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలివీ..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని