బాలయ్య.. ఎనర్జీకే పవర్‌హౌస్‌: ప్రగ్యా - balayya is a powerhouse of energy says pragya
close
Published : 17/03/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య.. ఎనర్జీకే పవర్‌హౌస్‌: ప్రగ్యా

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు బాలకృష్ణతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం అద్భుతంగా ఉందని నటి ప్రగ్యాజైశ్వాల్‌ అన్నారు. ‘కంచె’ చిత్రంతో తెలుగులో మొదటి అవకాశంతోనే గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే ఆమెకు బాలయ్యతో కలిసి నటించే అవకాశం లభించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. ‘బీబీ3’లో నటించడంపై తాజాగా ప్రగ్యా స్పందించారు.

‘‘బాలకృష్ణ సర్‌తో స్క్రీన్‌ పంచుకోవడం అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎనర్జీకే పవర్‌హౌస్‌. సెట్‌లో ఎప్పుడూ పాజిటివిటీని నెలకొల్పుతారు. సినిమా పట్ల ఆయనకున్న అభిరుచికి ఎవరూ సాటిరారు. ‘బీబీ3’ కంటే ముందే ‘జయ జానకి నాయక’ కోసం బోయపాటి డైరెక్షన్‌లో నటించాను. ఇప్పుడు బోయపాటితో కలిసి వర్క్‌ చేయడం సులభంగా అనిపిస్తోంది. కథ పట్ల దర్శకుడికి ఉన్న విజన్‌, స్పష్టత ఎంతో స్ఫూర్తిదాయకమైనది. నటీనటులు, ఇతర చిత్రబృందం మరింత శ్రమించే విధంగా ప్రతిరోజూ ఆయన మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు’’

‘‘కరోనా క్లిష్ట పరిస్థితుల తర్వాత నేను నటిస్తున్న మొదటి చిత్రమిది. ఇది నాకెంతో స్పెషల్‌. అలాగే నటిగా నా కలల్ని సాకారం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని ప్రగ్యా జైశ్వాల్‌ తెలిపారు. మరోవైపు ‘సింహా’, ‘లెజండ్‌’ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని