‘మై నే ప్యార్‌కియా’లో నటించొద్దనుకున్నాను: భాగ్యశ్రీ - bhagyashree i had initially refused maine pyar kiya
close
Updated : 05/01/2021 11:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మై నే ప్యార్‌కియా’లో నటించొద్దనుకున్నాను: భాగ్యశ్రీ

ముంబయి: బాలీవుడ్‌లో ‘మై నే ప్యార్‌ కియా’ ఎంతటి  సూపర్‌హిట్టో అందరికి తెలిసిందే. ‘ప్రేమ పావురాలు’గా విడుదలై తెలుగు ప్రేక్షకులకూ ఈ సినిమా సుపరిచితమే. ఈ చిత్రంలో భాగ్యశ్రీ, సల్మాన్‌ల నటన అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి అలాంటి సూపర్‌హిట్‌ సినిమాలో  నాటి హిరోయిన్‌ భాగ్యశ్రీ నటించకూడదనుకున్నారటా! ఈ విషయం స్వయంగా ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పటం విశేషం. ‘‘ నాకు నటిగా బాగా పేరుతెచ్చిపెట్టిన ‘మై నే ప్యార్‌ కియా’ చిత్రంలో మొదట నటించకూడదని అనుకున్నా. అందుకు కారణం చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లే ఉద్దేశం ఉండటమే. మా నాన్న మాత్రం ఇండియాలోనే చదువు పూర్తి చేయాలని నాతో వాదించేవారు. ఆ సమయంలోనే  చిత్ర దర్శకులు సూరజ్ బర్జత్యా నాకు స్క్రిప్ట్‌ వినిపించారు. ఆయన మొదటిసారి నేరేట్‌ చేసినపుడే ఆ స్క్రిప్ట్‌ నాకు చాలా నచ్చింది. కానీ నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉండటంతో నో చెప్పేదాన్ని. అయినప్పటికి సూరజ్‌ పట్టువిడకుండా స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేస్తూ మొత్తం ఎనిమిది సార్లు నాకు వినిపించారు. అన్ని సార్లు ఏదోక కారణం చెప్పిన నేను చివరికి ఈ చిత్రం చేస్తునట్టు అంగీకారం తెలిపాను. ఫలితం నా కెరీర్‌లోనే బంపర్‌హిట్‌’ అంటూ అప్పటి సంగతిని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా ఉన్నాయి. ప్రస్తుతం భాగ్యశ్రీ ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాథేశ్యామ్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చదవండి!

రకుల్‌ సూక్తులు.. వేదిక మ్యాజిక్కులు

రామతీర్థంలో సోము వీర్రాజు అరెస్ట్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని