భారత క్రికెటర్లే గట్టోళ్లు! - bio-bubble is tough but indians more tolerant ganguly
close
Updated : 06/04/2021 17:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత క్రికెటర్లే గట్టోళ్లు!

విదేశీయుల కన్నా మానసిక సమస్యలను మెరుగ్గా ఎదుర్కోగలరు: దాదా

కోల్‌కతా: మానసిక ఆరోగ్య సమస్యలను తట్టుకోవడంలో విదేశీయులతో పోలిస్తే భారత క్రికెటర్లు మరింత మెరుగని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్‌ ఆడటం ఎవరికైనా కష్టమేనని పేర్కొన్నారు. ఏ రంగంలో ఉన్నా ఒడుదొడుకులు తప్పవని స్పష్టం చేశారు. కొవిడ్‌-19 వల్ల ప్రస్తుతం క్రికెటర్లందరూ బుడగల్లోనే ఉంటూ మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లీ సైతం బాహాటంగానే ఈ విషయాన్ని ఎత్తిచూపాడు.

‘విదేశీ క్రికెటర్లతో పోలిస్తే మన భారతీయులు మరికాస్త ఎక్కువ ఒత్తిడి తట్టుకోగలరు. నేను ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ క్రికెటర్లతో కలిసి ఆడాను. మానసిక ఆరోగ్యం విషయంలో వారు సున్నితంగా ఉంటారు. ఆరేడు నెలలుగా బయో బుడగల్లో విపరీతంగా క్రికెట్‌ జరుగుతోంది. ఇది చాలా కఠినమైన విషయం. హోటల్‌ నుంచి మైదానంలోకి వచ్చి ఒత్తిడి అనుభవించి మళ్లీ హోటల్‌కే వెళ్లాలి. ఇదంతా ఓ కొత్త జీవితం!’ అని దాదా తెలిపారు.

‘ఆస్ట్రేలియా జట్టును చూడండి. టీమ్‌ఇండియా సిరీసుల తర్వాత టెస్టు సిరీస్‌ కోసం వారు దక్షిణాఫ్రికా వెళ్లాలి. కానీ వారందుకు తిరస్కరించారు. దానికి తోడుగా కరోనా భయం పట్టుకుంది. అందుకే చాలా సానుకూలంగా ఉండాలి. మానసికంగా సన్నద్ధం అవ్వాలి. మంచి జరగాలని మనమంతా సమష్టిగా సానుకూలంగా ఉండటం అవసరం’ అని గంగూలీ పేర్కొన్నారు. 2005 తర్వాత తనను కెప్టెన్సీ నుంచి తొలగించడం భారీ ఎదురుదెబ్బని ఆయన వెల్లడించారు.

‘అలాంటివి ఎదుర్కొని తీరాల్సిందే. మన మానసిక వైఖరి బాగుంటే వాటిని ఎదుర్కోగలం. క్రీడలు, వ్యాపారం, ఇంకా ఏదైనా కానివ్వండి.. జీవితంలో దేనికీ హామీ లేదు. ఒడుదొడుకులు తప్పక ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా ఒత్తిడి ఉంటుంది. మనమంతా వేర్వేరు రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాం. తొలి టెస్టు ఆడుతున్నప్పుడు ప్రపంచం మనల్ని గుర్తించాలన్న ఒత్తిడి ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణంలో ఎప్పుడో ఒకసారి ఫామ్‌ కోల్పోతే జనాల నుంచి విమర్శల ఒత్తిడి వస్తుంది’ అని ఆయన  వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని