Instagram: 5కోట్ల ఫాలోవర్లున్న ముద్దుగుమ్మలు - bollywood celebrities who are a part of 50 million club on instagram
close
Published : 14/05/2021 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Instagram: 5కోట్ల ఫాలోవర్లున్న ముద్దుగుమ్మలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా హీరోయిన్లకు అందం.. అభినయం.. ఉండాలనేది పాత మాట. వాటితో పాటు చలాకీతనం.. అల్లరి.. కూడా అవసరమే అనేది ఇప్పటి మాట. అప్పుడే ఫాలోవర్లు పెరుగుతారు. అవును.. సినిమా తారలకు సినిమాలతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడమూ అంతే కీలకంగా మారింది. హీరోయిన్ల విషయంలో అది మరీ ముఖ్యం. ఎందుకంటే.. వాళ్లు ఫన్నీ పోస్టులకే కాదు ప్రకటనలకు.. ప్రచార కార్యక్రమాలకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికైందిప్పుడు. అందుకే ఫాలోవర్లను పెంచుకోవడానికి హాట్‌హాట్‌ ఫొటోలతో పాటు డ్యాన్సులు.. పాటలు.. యోగా.. జిమ్‌.. ఇలా ఎన్నో రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఎంత చేసినా ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడం అంత సులభమైన పనేం కాదు. అయితే.. కొంతమంది బాలీవుడ్‌ భామలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో 5కోట్ల మంది ఫాలోవర్లతో హవా నడిపిస్తున్నారు. అందులో నలుగురు హీరోయిన్లు ఉండగా.. ఒక సింగర్‌ కూడా ఉండటం విశేషం. ఇంతకీ వాళ్లెవరో చూసేద్దామా..!

ఇంటర్నేషనల్‌.. ఇండియన్‌ బ్యూటీ

ఇటు బాలీవుడ్‌తో పాటు అటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ అంతర్జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న భామ ప్రియాంక చోప్రా. తన భర్త నిక్‌జోనస్‌తో కలిసి దిగిన ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తుంటుంది. ఇక్కడ ఈ జోడీకి క్రేజ్‌ ఎక్కువే. అప్పుడప్పుడు కాస్త హాట్‌హాట్‌ ఫొటోలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. భారత్‌లో కోహ్లీ తర్వాత 50 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఘనత ప్రియాంకదే. ప్రియాంక ఇప్పటి వరకు 3,365 పోస్టులు చేసింది. ఆమెను 6కోట్ల 32లక్షల మంది ఫాలో అవుతుండగా.. ఆమె 598 మందిని అనుసరిస్తోంది. 

సాహో.. శ్రద్ధా

ప్రియాంక తర్వాత అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌. ఈ సాహో భామ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకూ 1,768 పోస్టులు చేసింది. ఆమెను 6కోట్ల 19లక్షల మంది అనుసరిస్తున్నారు. ఆమె మాత్రం 748 మందిని ఫాలో అవుతోంది.

సింగర్‌.. నేహా కక్కర్‌

హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని సొగసు సింగర్‌ నేహా కక్కర్ సొంతం. అందమైన గొంతుతో పాటు చలాకీ తనంతో ఎంతో మంది అభిమానం సొంతం చేసుకుంది. అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన సింగర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ను ఏలుతోంది.  పలు సినిమాల్లో నటిగానూ అలరించింది. ఆమె ఇప్పటి వరకూ 2,082 పోస్టులు చేసింది. 5కోట్ల 71లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె 428 మందిని అనుసరిస్తోంది.

డిలీట్‌ చేసినా.. టాప్‌లోనే దీపిక

ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేసే భామల్లో దీపిక పదుకొణె ఒకరు. తన భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి ఈ భామ చేసే అల్లరి అంతాఇంతా కాదు. కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులన్నీ తొలగించిన ఈ సొట్టబుగ్గల సుందరి అడపాదడపా పోస్టులు చేస్తూ వస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని పోస్టులు తొలగించిన తర్వాత మళ్లీ మొదలు పెట్టి 49 పోస్టులు చేసింది. ఆమెను 5కోట్ల 65లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె 143 మాత్రమే అనుసరిస్తోంది.

ఆలియా.. మజాకా..

5కోట్ల ఫాలోవర్లు ఉన్న ఉన్న మరో భామ ఆలియా భట్‌. ఇటీవల కరోనాపై అవగాహన కల్పించేందుకు ఇన్‌స్టా వేదికగా వరుస పోస్టులు చేస్తోందీ ఆర్ఆర్‌ఆర్ భామ. తన చిన్ననాటి ఫొటోలతో పాటు తన సినిమా ప్రమోషన్లు. ఫొటో షూట్లు పంచుకుంటూ ఉంటుంది. ఆమె ఇప్పటి వరకూ 1,705 పోస్టులు చేసింది. ఆమెను 5 కోట్ల 30లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు. 432 మందిని ఆమె ఫాలో అవుతోంది.

జాక్వలైన్‌.. జోరు

జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌.. ఇటీవల 5కోట్ల క్లబ్‌లో చేరింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకెళుతోందీ శ్రీలంకన్‌ బ్యూటీ. ఇప్పటి వరకూ 2,272 పోస్టులు చేసింది. 5కోట్ల 5లక్షల మంది ఈ మాజీ మిస్‌ యూనివర్స్‌ను ఫాలో అవుతున్నారు. 1,010 మందిని ఈమె తిరిగి అనుసరిస్తోంది.









మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని