బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగం - brazil has more than 4000 covid deaths in 24 hours for first time
close
Published : 07/04/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగం

రియోడిజెనేరో: కరోనా వైరస్‌ బ్రెజిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొవిడ్‌ కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో రికార్డుస్థాయిలో కొత్త మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో అత్యధికంగా 4195 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అమెరికా, పెరూలో మాత్రమే ఇప్పటివరకు ఒక్కరోజులో నాలుగు వేల మరణాలు సంభవించాయి.

బ్రెజిల్‌లో ఇప్పటివరకు 1.31 కోట్ల మంది కొవిడ్‌ బారిన పడగా.. మహమ్మారి కాటుకు 3.37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంక్షలను సడలించడమే వైరస్‌ ఉద్ధృతికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న 90 శాతం ఐసీయూల్లో కొవిడ్‌ రోగులే చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా బ్రెజిల్‌లో 3 శాతం మంది ప్రజలు కొవిడ్‌ టీకాలు తీసుకున్నట్లు ప్రపంచ డేటా పేర్కొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని