అర్హకు బన్నీ సర్‌ప్రైజ్‌.. అదాకు ఫిదా..! - celebrities social media round up
close
Published : 22/11/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అర్హకు బన్నీ సర్‌ప్రైజ్‌.. అదాకు ఫిదా..!

సోషల్‌ లుక్‌: సెలబ్రిటీలు పంచుకున్న విశేషాలు

* తన చిట్టితల్లి అర్హ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. స్టైలిష్‌ స్టార్‌ గుర్రాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు అర్హతో కేక్‌ కట్‌ చేయిస్తున్న ఫొటోను కూడా బన్నీ పంచుకున్నారు.

* కథానాయిక తమన్నా నటిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ‘11th అవర్‌’. దీని చిత్రీకరణ పూర్తయిందంటూ ఆమె సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ‘ఈ చిత్ర బృందాన్ని చాలా మిస్‌ అవబోతున్నా. కరోనా సంక్షోభంలోనూ సెట్‌లో ఎంతో ఎంజాయ్‌ చేశాం’ అని పేర్కొన్నారు.

* తన తండ్రి కృష్ణరాజ్‌ రాయ్‌ను ఐశ్వర్యరాయ్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ‘హ్యాపీ బర్త్‌డే డాడ్‌.. మిస్‌ యు’ అంటూ అభిషేక్‌ బచ్చన్‌ కూడా పోస్ట్‌ చేశారు.

* కథానాయిక అదా శర్మ మరోసారి తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. కథక్‌ డ్యాన్స్‌ చేసిన వీడియోను సోషల్ ‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి ఫాలోవర్స్‌ నుంచి మంచి స్పందన లభించింది.

* నటి ప్రణీత మాల్దీవుల్లో విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారు. సముద్రంలో సరదాగా సమయం గడుపుతున్న ఫొటోల్ని షేర్‌ చేశారు.

* నటుడు మంచు విష్ణు ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. అందులో ఆయన ఎదురుగా ఓ వ్యక్తి కూర్చుని ఉన్నారు. ‘నేను ఎవరితో మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. ఓ హింట్‌ ఇస్తా.. నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరు’ అని పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు ‘ఢీ 2’ కోసం దర్శకుడు శ్రీనువైట్లతో మాట్లాడుతున్నారని కామెంట్లు చేశారు.

















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని