close
Published : 20/04/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Trailer: ఆహా వేదికగా ‘చావు కబురు చల్లగా’

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. ఈ చిత్రం ‘ఆహా’లో ఏప్రిల్‌ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆహా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. కార్తికేయ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం అలరిస్తోంది. ఈ చిత్రంలో ఆమని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం తదితరులు కీలక పాత్రలు పోషించారు. జేక్స్‌ బెజోయ్‌ సంగీతం అందించారు. కూర్పు: సత్య జీ, ఛాయాగ్రహణం: కార్మ్‌ చావ్లా, కళ: జి.ఎం. శేఖర్‌.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని