అన్నయ్య టైటిల్‌తో తమ్ముడు వస్తున్నాడా? - chiranjeevi movie title for pawan kalyan new flick
close
Published : 26/10/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నయ్య టైటిల్‌తో తమ్ముడు వస్తున్నాడా?

పవన్‌ కెరీర్‌లో ఇది రెండోసారి...

హైదరాబాద్‌: ‘తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌‌ ఇన్‌ ఏ హై ఓల్టేజ్‌ రోల్‌’ అంటూ పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల చేసింది. ఊహించని సర్‌ప్రైజ్‌కి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. అయితే చిత్రబృందం అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోందా... అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. సినిమాకు చాలా ఆసక్తికరమైన టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం. సినిమా పేరుకు సంబంధించిన క్లూను ఈ రోజు రిలీజ్‌ చేసిన వీడియోలో వినిపించింది అని కూడా అంటున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నెం.12గా సిద్ధమవుతున్న ఈ సినిమా పూర్తి వివరాలు చెప్పలేదు. అయితే ఇది మలయాళంలో మాంచి విజయం అందుకున్న ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’కు రీమేక్‌ అని తెలుస్తోంది. అందులో బిజు మేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ పోసిస్తున్నారని తెలుస్తోంది. అలాగే మరో కీలక పాత్రలో రానా నటిస్తాడని భోగట్టా.  ఈ పాత్రను మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించారు.  

ఈ సినిమాకు అలనాటి హిట్‌ సినిమా ‘బిల్లా రంగా’ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో పవన్‌ పేరు బిల్లా అనే వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన మరో కీలక పాత్రధారి రానా పేరు రంగా అవుతుంది. ఈ రోజు విడుదలైన వీడియోలో బ్యాగ్రౌండ్‌లో ‘బిల్లా.. రంగా’ అనే వాయిస్‌ వినిపిస్తోంది. అలా ఇదే సినిమా పేరు అని నెటిజన్లు అనుకుంటున్నారు. 1982లో వచ్చిన ‘బిల్లా రంగా’లో చిరంజీవి, మోహన్‌బాబు నటించిన విషయం తెలిసిందే. అలా కెరీర్‌లో రెండోసారి పవన్‌... అన్నయ్య చిరంజీవి సినిమా టైటిల్‌ను వాడుకుంటున్నాడన్నమాట. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని