చూసి నేర్చుకోకు.. ఇవన్నీ లెక్కచేయమాకు - choosi nerchukoku song from rangde
close
Published : 14/03/2021 17:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చూసి నేర్చుకోకు.. ఇవన్నీ లెక్కచేయమాకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవర్నీ చూసి నేర్చుకోకు.. ఇవన్నీ లెక్కచేయమాకు అంటున్నాడు హీరో నితిన్‌. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. కీర్తి సురేశ్‌ నాయిక. మార్చి 26 విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమాలోని ‘చూసి నేర్చుకోకు’ అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. పక్కవారితో పోల్చుకుంటే ఏమవుతుందో తన  సాహిత్యంతో తెలియజేసే ప్రయత్నం చేశారు శ్రీమణి. ‘పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకో అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో, సన్‌లైట్‌ని చూసి నేర్చుకుని ఉంటే ఫుల్‌మూన్‌ కూల్‌గా ఉండేవాడా’ అంటూ సరదాగా సాగుతూ ఈ పాట అలరిస్తోంది. డేవిడ్‌ సిమన్‌ ఆలపించిన ఈ గీతానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని