పగ్గాల్లేని కరోనా.. మహారాష్ట్రలో 49వేలకు పైనే! - corona update in maharastra
close
Updated : 03/04/2021 22:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పగ్గాల్లేని కరోనా.. మహారాష్ట్రలో 49వేలకు పైనే!

ముంబయి: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ వ్యాప్తి కట్టడి కావడంలేదు. తాజాగా దాదాపు 50వేలకు చేరువగా రావడం కలకలం రేపుతోంది. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో 49,447 కొత్త కేసులు, 277 మరణాలు నమోదు కాగా.. 37,821మంది కోలుకున్నారు.

ఒక్క ముంబయి మహానగరంలోనే ఈ రోజు 9వేలకు పైగా కొత్త కేసులు, 27 మరణాలు నమోదైనట్టు బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. అలాగే, మరో 5322మంది కోలుకోవడంతో ఇప్పటివరకు నగరంలో కోలుకున్నవారి సంఖ్య 3,66,365కి చేరింది. ప్రస్తుతం 62,187 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా 2,03,43,123 శాంపిల్స్‌ పరీక్షించగా.. 29,53,523మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 24,95,315మంది కోలుకోగా.. 55,656 మంది మృతిచెందారు. ప్రస్తుతం 4,01,172 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ను తోసిపుచ్చలేమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం అన్నారు. రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. ప్రసుతం ఉన్న పరిస్థితులు ఇలానే ఉంటే ఆరోగ్య సౌకర్యాల కొరత ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో రోజుకు 2.2 లక్షల ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రంలో 1 నుంచి 8తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసింది. వారందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. 9, 11 తరగతుల విద్యార్థుల విషయంలోనూ త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని