అక్తర్‌ ‘దెబ్బకు’ క్రికెట్‌ ఆడాలా అనుకున్నా..! - darren sammy recalls the shoaib akhtar hitting brian lara which made him to rethink of choosing cricket as his carrer
close
Published : 25/05/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్తర్‌ ‘దెబ్బకు’ క్రికెట్‌ ఆడాలా అనుకున్నా..!

2004 బ్రియన్‌ లారా సంఘటన గుర్తుచేసిన డారెన్‌ సామి

ఇంటర్నెట్‌డెస్క్‌: 2004 ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియన్‌ లారాను గాయపర్చిన  సంఘటన నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంపిక చేసుకునే విషయంపై సందేహం కలిగిందని చెప్పాడు. సామి సోమవారం ఓ పాకిస్థాన్‌ మీడియాతో మాట్లాడుతూ నాటి సంఘటన గురించి పూసగుచ్చినట్టు వివరించాడు.

‘2004లో ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా నేను వెస్టిండీస్‌ తరఫున అరంగేట్రం చేసినప్పుడు రోజ్‌బౌల్‌ మైదానంలో పాకిస్థాన్‌తో ఓ మ్యాచ్‌ జరిగింది. అప్పుడా జట్టు మహ్మద్‌ సమి, వకార్‌ యూనిస్‌, షోయబ్‌ అక్తర్‌తో బౌలింగ్‌ చేయించింది. ఆరోజు అక్తర్‌ వేసిన ఓ బంతి లారా తలకు తగిలింది. దాంతో వెంటనే అతడు కిందకు పడిపోయాడు. అప్పుడు బ్రావో పక్కనే కూర్చున్న నేను.. ఇది చూశాక మళ్లీ క్రికెట్‌ ఆడాలనుకుంటున్నావా? అని నాకు నేనే ప్రశ్నించుకున్నా. అక్తర్‌ నన్ను అలా అనుకునేలా చేశాడు’ అని సామి నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు.

కాగా, ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 38.2 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ యాసిర్ హమీద్‌(39; 56 బంతుల్లో 6x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంజమామ్‌ ఉల్‌ హక్‌(21), షోయబ్‌ మాలిక్‌(17), మహ్మద్‌ యూసుఫ్‌(12) విఫలమయ్యారు. ఆపై విండీస్‌ స్వల్ప లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 28.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ లారా(31; 30 బంతుల్లో 5x4) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరగ్గా రామ్‌నరేశ్‌ శర్వాన్‌(56 నాటౌట్‌; 85 బంతుల్లో 6x4, 1x6) చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని