T20 WorldCup: తప్పు జరిగితే రోహితే కెప్టెన్‌!   - deep dasgupta feels if anything goes wrong in t20 world cup then rohit sharma will be the main contender
close
Published : 04/07/2021 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

T20 WorldCup: తప్పు జరిగితే రోహితే కెప్టెన్‌! 

కెప్టెన్సీ మార్పుపై మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌గుప్తా..

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది నెలల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో ఏదైనా తప్పు జరిగితే కెప్టెన్సీ మార్పులు చోటుచేసుకుంటాయని మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సామర్థ్యంపై మరోసారి అనుమానాలు రేకెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన దీప్‌దాస్‌ ఈ ప్రపంచకప్‌తో కోహ్లీ కెప్టెన్సీ భవితవ్యంపై స్పష్టత వస్తుందన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కెప్టెన్సీ మార్పు మంచిది కాదన్నాడు.

‘ఇప్పుడు కెప్టెన్సీ మార్పు చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పను కానీ, కచ్చితంగా రోహిత్‌కే ఆ అవకాశం ఉందని అంటాను. ఈ పొట్టి ప్రపంచకప్‌తో అనేక విషయాలు ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కెప్టెన్సీ మార్పు అనేది చాలా కష్టమైన పని. ఆ మెగా ఈవెంట్‌కు ఇంకో 3-4 నెలల సమయమే మిగిలిఉంది. దాంతో ఇప్పుడు సారథిని మార్చినా కొత్త కెప్టెన్‌తో జట్టు కలిసిపోవాలి. మరోవైపు రోహిత్‌ ఇదివరకే పలు సందర్భాల్లో నాయకత్వం వహించాడు. అయినా, తాత్కాలిక కెప్టెన్సీకి పూర్తిస్థాయి కెప్టెన్సీకి చాలా వృత్యాసం ఉంటుంది. ఎందుకంటే స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌గా ఉంటూ జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. కానీ, ఎవరైనా పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారినప్పుడు జట్టులో తనదైన ముద్ర వేయాలని అనుకుంటాడు’ అని దీప్‌దాస్ వివరించాడు.

ప్రపంచకప్‌కు 3-4 నెలల ముందు కెప్టెన్సీలో మార్పు చేయడం సరికాదని, అది జట్టుకు, రోహిత్‌కు, విరాట్‌ కోహ్లీకి.. ఎవరికీ మంచిది కాదని మాజీ కీపర్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, కెప్టెన్సీ మార్పు విషయంలో ఈ ప్రపంచకప్‌ కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని అతడు అంచనా వేశాడు. అక్కడ ఏదైనా తప్పు జరిగితే రోహిత్‌ శర్మనే కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని దీప్‌దాస్‌ భావిస్తున్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని